అమెరికాలో గూఢచారి

అమెరికాలో గూఢచారి

01-03-2018

అమెరికాలో గూఢచారి

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం గూఢచారి. పీపుల్‌ మీడియాలో ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ విస్టా డ్రీమ్‌ మర్చంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్క దర్శకుడు. అడివిశేష్‌ ఈ చిత్రానికి కథ సమకూర్చుగా, మిస్‌ ఇండియా, తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల  హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ అమెరికాలో జరుగుతోంది.  ఈ సందర్భంగా నిర్మాణతలు అభిషేక్‌ నామా, టివి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కతోందన్నారు. ఢిలీ, పూనే, హైదరాబాద్‌, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్‌, చిట్టగాంగ్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ అమెరకాలోని కాస్కేడ్‌ మౌంటైన్స్‌లో జరుగుతోంది. అక్కడి అందమైన, అత్యుద్భుతమైన లొకేషన్స్‌లో ఆడివిశేష్‌ షూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఆయన ఒక స్పై పాత్రలో కన్పించనున్నారన్నారు. వేసవి కానుకగా గూఢచారి చిత్రాన్ని విడుదల చేయనున్నామన్నారు.