రేపటి నుంచి థియేటర్లు బంద్

రేపటి నుంచి థియేటర్లు బంద్

01-03-2018

రేపటి నుంచి థియేటర్లు బంద్

రేపటి (మార్చి 2) నుంచి థియేటర్లలో సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొడైడర్లు వసూలు చేస్తున్న అధిక ధరలకు సంబంధించి ఇటీవలే దక్షిణభారత సినీ పరిశ్రమల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వారితో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో థియేటర్లను బంద్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు సినీ పరిశ్రమల సమిష్టిగా పోరాటం చేసిన డిజిటల్‌ యాజమాన్యాలు దిగిరాలేదు. మా పోరాటానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని  థియేటర్ల యాజమాన్యాలు సంపూర్ణ మద్దతునిచ్చాయి. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు అందరు ఒకేతాటిపైకి వచ్చి చేస్తున్న ఈ పోరాటానికి ప్రేక్షకులు సహకరించాలని కోరుకుంటున్నాం. సినిమాల ప్రదర్వన నిలిపివేత ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రామదాసు, దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.