మార్చిలో శ్రియ పెళ్లి
Sailaja Reddy Alluddu

మార్చిలో శ్రియ పెళ్లి

28-02-2018

మార్చిలో శ్రియ పెళ్లి

కథానాయిక శ్రియకు పెళ్లి కుదిరింది. వచ్చే నెలలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతోంది. రష్యాకి చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కొశీవ్‌ని ఆమె మనువాడబోతోంది. ఉదయ్‌పూర్‌లో మార్చి 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల వేడుకగా వీరి పెళ్లి జరగబోతోందని తెలిసింది. తెలుగులో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఇష్టంతో ప్రయాణం మొదలుపెట్టిన శ్రియ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతో పాటు ఆంగ్లంలోనూ నటించిన పేరు తెచ్చుకొన్నారు. కొశీవ్‌కీ, శ్రియకీ మధ్య ఎప్పట్నుంచో స్నేహం కొనసాగుతోంది. ఆ బంధం పెళ్లికి దారితీసినట్లు తెలుస్తోంది.