విట్నీ హ్యూస్టన్ లాగే శ్రీదేవి విషాదాంతం
MarinaSkies
Kizen
APEDB

విట్నీ హ్యూస్టన్ లాగే శ్రీదేవి విషాదాంతం

28-02-2018

విట్నీ హ్యూస్టన్ లాగే శ్రీదేవి విషాదాంతం

శ్రీదేవి, ప్రముఖ అమెరికన్‌ గాయని విట్నీ హ్యూస్టన్‌ మరణించిన ఉదంతాలు ఒకేలా ఉన్నాయని బాలీవుడ్‌ నటి సిమి గరేవాట్‌ ట్వీట్‌ చేశారు. 48 ఏండ్ల వయసులో సింగర్‌ విట్నీ హ్యూస్టన్‌ బెవెర్లీహిల్స్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న అనంతరం హోటల్‌లోని బాత్‌ టబ్‌లో శవమై తేలారు. హ్యూస్టన్‌ ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగిపోయారని, ఆమె మృతివెనుక ఎలాంటి నేరపూరిత కోణం లేదని అప్పటి లాస్‌ఏంజెల్స్‌ కరోనర్‌ అధికారిక నివేదికలో పేర్కొన్నారు. కాగా, విట్నీ హూస్టన్‌ మరణించిన తరహాలోనే శ్రీదేవి విషాదాంతం చోటు చేసుకుందని సిమి గరేవాల్‌ తెలిపారు.