అమెరికాలో హీరో విశాల్

అమెరికాలో హీరో విశాల్

26-02-2018

అమెరికాలో హీరో విశాల్

చికిత్స కోసం సినీ నటుడు విశాల్‌ అమెరికాకు వెళ్ళారు. ఆయన చికిత్స ముగించుకుని మరో పది రోజుల తర్వాత నగరానికి చేరుకోనున్నారు. విశాల్‌ ప్రస్తుతం తుప్ప రివాళన్‌ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో విశాల్‌ గాయపడ్డాడు. దీంతో మోకాలికి గాయమైంది. దీనికి తోడు విశాల్‌ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విశాల్‌ అక్కడ చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్ళి అక్కడ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ చికిత్స ముగించుకుని, మరో పది రోజుల్లో చెన్నైకు చేరుకుంటారని విశాల్‌ అనుచరులు వెల్లడించారు.