దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి

దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి

24-02-2018

దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి భువి నుంచి దివికి వెళ్లిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది.

బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లినట్లుగా బాలీవుడ్ వర్గాలు ప్రకటించాయి. ధడక్  చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్ళికి వెళ్లలేదని సమాచారం. ఇప్పటికే శ్రీదేవి ఇంటికి వారి ఫ్యామిలీ సన్నిహితులు, సినీరంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే జాన్వీ కూడా షూటింగ్ నుండి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. శ్రీదేవి హార్ట్ ఎటాక్‌తో మరిణించారనే విషయం తెలిసిన సినిమా రంగం ఒక్కసారిగా షాక్‌కి గురయింది. సోషల్ మీడియా అంతా ఈ వార్త స్ప్రెడ్ అయింది. శ్రీదేవి మరణించారనే వార్తని ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు.