2019 ఎన్నికల్లో పోటీ : సుమన్
Sailaja Reddy Alluddu

2019 ఎన్నికల్లో పోటీ : సుమన్

12-02-2018

2019 ఎన్నికల్లో పోటీ : సుమన్

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగేదీ త్వరలోనే ప్రకటిస్తానని సినీ హీరో సుమన్‌ వెల్లడించారు. విజయనగరంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యరకమానికి ఆయన హాజరయ్యారు. ఈ సంద్భంగా మీడియాతో మాట్లాడుతూ  వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు. అన్నం పెట్టే రైతులకు ఎవరు న్యాయం చేస్తేవారికి ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టాలని ప్రజలకు పిలుపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆరోగ్యం, ఉచిత విద్య, అందరికీ ఉపాధి కల్పించే నేతను ఎన్నుకోవాలని సూచించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను అమ్మమ్మ గారింట్లో అనే చిత్రంలో పోలీసు ఆఫీసరుగా నటిస్తున్నానని తెలిపారు.