కాషాయం జోలికెళ్తే కటీఫ్

కాషాయం జోలికెళ్తే కటీఫ్

12-02-2018

కాషాయం జోలికెళ్తే కటీఫ్

సినీనటుడు కమల్‌హాసన్‌ వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశమయ్యాయి. అవసరమైతే రజినీతో కలిసి రాజకీయాల్లో పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించిన కమల్‌, తాజాగా మా విధానాలు భిన్నమైనవి. ముందుగా రజినీ రంగుపై సృష్టత నివ్వాలి. రజినీతి కాషాయరంగు కాదని నేను భావిస్తున్నా. ఒకవేళ కాషాయరంగైతే ఆయనతో కలిసి పనిచేయలేను అని సృష్టం చేశారు. హార్వర్డ్‌ వర్సిటీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులను సవాల్‌ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పారు. సదస్సుకు హాజరైన వారి ప్రశ్నకు సమాధానం చెబుతూ మ్యానిఫెస్టోపై తమ ఆలోచనలు ఒకేలా ఉన్నా మతాలు, రంగు విషయంలో తేడాలు ఉన్నాయన్నారు.