రష్యన్ యువకుడితో శ్రియ వివాహం ?

రష్యన్ యువకుడితో శ్రియ వివాహం ?

06-02-2018

రష్యన్ యువకుడితో శ్రియ వివాహం ?

37 ఏళ్ళ వయస్సులోను తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న గ్లామర్‌ బ్యూటీ శ్రియ. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటిన ఇప్పటికి ఈ అమ్మడు అభిమానులకి కొత్తగానే కనిపిస్తుంటుంది. ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టి దేవిగా నటించిన శ్రియ తన నటనతో ఆడియన్స్‌ ని కట్టిపడేసింది. ఆ తర్వాత మళ్లీ బాలయ్యతో పైసా వసూల్‌ చేసింది. ప్రస్తుతం గాయత్రి అనే సినిమాలో విష్ణు సరసన నటిస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. అయితే ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి నటిగా పేరుతెచ్చుకున్న శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు సినీవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కొద్ది రోజులుగా రష్యన్‌ యువకుడితో సన్నిహితంగా ఉంటున్న శ్రియ, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యాకు వెళ్లిందట. మార్చిలో రాజస్థాన్‌ వేదికగా వీరి పెళ్లి జరగనున్నట్లు సమచారం. మరి డెహ్రడూన్‌ కు చెందిన శ్రియ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తుండగా, దీనిపై క్లారిటీ రావలసి ఉంది.