ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జి

ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జి

06-02-2018

ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జి

నటుడు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. బాలకృష్ణ కుడి భుజానికి ఆపరేషన్‌ చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన గాయపడ్డారు. అప్పటినుంచి ఆయన రొటేటర్‌ కఫ్‌ టియర్స్‌ ఆఫ్‌ షోల్డర్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రిలో చేరిన బాలకృష్ణకు ఆపరేషన్‌ చేసినట్లు డాక్టర్‌ ఆశిష్‌ బాబల్కార్‌ తెలిపారు. 5 నుంచి 6 వారాల పాటు బాలకృష్ణ విశ్రాంతి తీసుకోవాలని ఆయన చెప్పారు.