మా ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌కు తలసానికి అహ్వానం

మా ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌కు తలసానికి అహ్వానం

06-02-2018

మా ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌కు తలసానికి అహ్వానం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని అమెరికాలో డల్లాస్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మా కార్యవర్గ సభ్యులు ఆహ్వానించారు. మంత్రి నివాసానికి వెళ్లిన మా అధ్యక్షుడు శివాజీ రాజా, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌, సంయుక్త కార్యదర్శి ఏడిద శ్రీరామ్‌, సురేష్‌, ఉత్తేజ్‌, సురేష్‌ కొండేటి తదితరులు ఈ వేడుకలో పాల్గొనాలని ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది.