దృష్టి థియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

దృష్టి థియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

03-02-2018

దృష్టి థియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

అందాల రాక్షసి, అలా ఎలా సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యానర్ పై రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దృష్టి.  రీసెంట్ గా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తుంది. 2.5 మిలియన్ డిజటల్ వ్యూస్ సాధించి చిన్న సినిమా గా మొదలై పెద్ద బజ్ ని క్రియేట్ చేసింది. అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబడుతున్నాయి. మారుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఇలాంటి సినిమా విజయాలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. దృష్టి అలాంటి సినిమా గా మిగులుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది యూనిట్.
ఈ సందర్భంగా, దర్శకనిర్మాతలు మాట్లాడుతూ:
‘ ట్రైలర్ కి వచ్చిన స్పందన చూసాక టీం చాలా వరకూ రిలీఫ్ అయ్యిందని అన్నారు. కొత్త కంటెంట్ ను ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారనడానికి దృష్టి పై పెరిగిన అంచనాలే నిరూపిస్తున్నాయి. ట్రైలర్ కి ఇలాంటి రెస్పాన్స్ ని ఊహించలేదు. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ట్రైలర్ చూసి అంచనాలు పెంచుకున్న ఆడియన్స్ ని డిజ్జప్పాయింట్ చేయము. హీరో రాహుల్ తో పాటు వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారబోతుంది.’అన్నారు.
రాహుల్ రవీంద్రన్ హీరోగా, పవని గంగి రెడ్డి హీరోయిన్లుగా పనిచేస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య ప్రకాష్, రవి వర్మ, ప్రమోదిని.. తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులుః

మేనేజర్ః జె వి డి ప్రసాద్, కో ప్రొడ్యూసర్ – శ్రీనివాస్ మోతుకూరి, కథ – బి.బి కిరణ్ (బి. భాను కిరణ్)
ఎడిటర్ – ఉద్దవ్ ఎస్ బి, సినిమాటోగ్రఫీ – పి.బాలరెడ్డి, సంగీతం- నరేష్ కుమారన్, పి.ఆర్వో- జియస్ కె మీడియా
బ్యానర్ – ఎమ్ స్వేర్, నిర్మాత – మోహన్, కథ, కథనం, దర్శకత్వం  – రామ్ అబ్బరాజు