తల, ముక్కు వద్దు కావాలంటే కాలు తీసుకోండి

తల, ముక్కు వద్దు కావాలంటే కాలు తీసుకోండి

02-02-2018

తల, ముక్కు వద్దు  కావాలంటే కాలు తీసుకోండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పద్మావత్‌ సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పద్మావతిగా దీపికా పదుకొనే నటన అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలపై కర్ణిసేన తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విడుదల తర్వాత కూడా వారి తీరు మారలేదు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీని చంపేస్తామని, హీరోయిన్‌ దీపిక తల, ముక్కు నరికి తెస్తే లక్షల్లో నజరానా ఇస్తామని ఆందోళనకారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ బెదిరింపులపై తాజాగా దీపిక స్పందించింది. సినిమాలో నటించినందుకు నా తల, ముక్కు నరికేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. దయచేసి నా ముక్కు కత్తిరించొద్దు. ఎందుకంటే నా ముక్కు అంటే చాలా ఇష్టం. కావాలంటే పొడవైన నా కాళ్లు నరికేసుకొండి. ఇలాంటి బెదిరింపులను తేలిగ్గా తీసుకోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవడానికి నేను భయపడనని దీపిక చెప్పింది.