హార్వర్డ్ లో కమల్ ప్రసంగం

హార్వర్డ్ లో కమల్ ప్రసంగం

02-02-2018

హార్వర్డ్ లో కమల్ ప్రసంగం

ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో కమల్‌ ప్రసంగించబోతున్నారు. కమల్‌ హార్వర్డ్‌ అతిథిగా వెళ్లడం ఇది రెండోసారి. రెండేళ్ల కిందట హార్వర్డ్‌ లో మాట్లాడారు కమల్‌. అప్పుడు విశ్వరూపం విడుదల అడ్డంకుల నేపథ్యంలో వాక్‌ స్వాతంత్య్రం గురించి ఈ దిగ్గజ నటుడు మాట్లాడగా, ఈ సారి ఆయన ప్రసంగంలో రాజకీయాల చర్చ ఉంటుందని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన కమల్‌ పార్టీ సంస్థాగత  ఏర్పాట్లలో తల మునకలయ్యారు. ఈలోగా హార్వర్డ్‌కు అతిథిగా రావలంటూ పిలుపొచ్చింది. ఈ నెల 10న ఆయన విశ్వవిద్యాయంలో మాట్లాడబోతున్నారు. 

ఈ విషయంపై కమల్‌ స్పందిస్తూ రాజకీయాలపైనే నా ప్రసంగం ఉంటుంది. ముఖ్యంగా తమిళనాట పరిస్థితులను హార్వర్డ్‌ వేదికగా అందరికీ తెలియజేస్తాను. అట్టడుగున చేరిన నా రాష్ట్రం బాగుండాలని కోరుకోవడం అక్కడి వ్యక్తిగా నా బాధ్యత. రాష్ట్రం బాగుంటే, దేశ అభివృద్ధికి కారణమవుతుంది. ఇది పరోక్షంగా జాతీయభావనే. హార్వర్డ్‌ లాంటి వేదికను మరోసారి పంచుకోవడం సంతోషంగా ఉంది. భావజాలం కలసిన వాళ్లతో ఐక్యంగా పనిచేస్తాను అని చెప్పారు. తన రాజకీయ లక్ష్యాలు, విధానాలు ప్రజలకు తెలిపేందుకు కమల్‌ హాసన్‌ త్వరలో తమిళనాడు అంతటా పర్యటించనున్నారు.