డీజే అరుదైన రికార్డ్

డీజే అరుదైన రికార్డ్

30-01-2018

డీజే అరుదైన రికార్డ్

స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా హిందీ వర్షన్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. 100 మిలియన్‌ వ్యూస్‌తో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. అసలే స్టైలిష్‌ స్టార్‌ మూవీ, ఇక దీనికి బన్నీ కామెడీ కూడా మిక్స్‌ అయింది. దీంతో సినిమా మంచి సక్సెస్‌ సాధించింది. యూ ట్యూబ్‌లో కూడా సన్సేషన్‌ క్రియేట్‌ చేయడం విశేషం. దీంతో ఖుషీ అయిన బన్నీ ట్వీట్‌ చేశాడు. ఇతర భాషల వారు తెలుగు సినిమాలను చూసి అప్రిషియేట్‌ చేస్తున్నారు. మీ ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ అంటూ బన్నీ ట్వీట్‌ చేశాడు. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బన్నీ సరసన పూజా హేగ్డే హీరోయిన్‌గా నటించింది. మురళీశర్మ, చంద్రమోహన్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటించారు.