ప్రియాంక చిత్రానికి చెత్త అవార్డులు!

ప్రియాంక చిత్రానికి చెత్త అవార్డులు!

29-01-2018

ప్రియాంక చిత్రానికి చెత్త అవార్డులు!

బాలీవుడ్‌లో ప్రతీ ఏడాది చెత్త అవార్డుల కార్యక్రమం పేరుతో గోల్డెన్‌ రేస్‌బెర్రీ అవార్డులను ఇస్తూ వస్తుండగా, 2017 సంవత్సరానికి గాను పలు విభాగాలలో చెత్త అవార్డుల జాబితాని ప్రకటించారు. చెత్త అవార్డుల ఎంపిక పూర్తి ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా జరుగుతుంది. అయితే దేశీ గార్ట్‌ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం బేవాచ్‌ ఏకంగా నాలు విభాగాలలో నామినేట్‌ అయి అందరిని ఆశ్చర్యపరిచింది. చెత్త చిత్రం, చెత్త హీరో, చెత్త రీమేక్‌, చెత్త స్క్రీన్‌ ప్లే విభాగంలో ఈ చిత్రం నామినేట్‌ అయింది. ఆస్కార్‌ అవార్డుల వేడుకకు ఒకరోజు ముందు అంటే మార్చి 3న ఈ రేస్‌బెర్రీ అవార్డుల వేడుక జరగనుంది. అప్పట్లో మహేష్‌ నటించిన ఒక్కడు హిందీలో తేవార్‌గా రీమేక్‌ కాగా,ఈ మూవీ చెత్త అవార్డులకి ఎంపిక అయింది. అలాగే రామ్‌ చరణ్‌ నటించి బాలీవుడ్‌ చిత్రంకి కూడా ఓ సారి చెత్త అవార్డుల జాబితాలో ఎంపికైంది. అయితే ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్‌ సినిమాకి ఇలా చెత్త అవార్డుల జాబితాలో ఎంపిక చేయడం పట్ల అభిమానులు కాస్త నిరూత్సాహానికి గురవుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ టీవీ షో క్యాంటికో మూడో సీజన్‌లోను, ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌ అనే చిత్రంలోను నటిస్తోంది. అలాగే ఆమె నటించిన ఏ కిడ్‌ లైక్‌ జేక్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.