క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి మహేష్ బాబు సాయం!

క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి మహేష్ బాబు సాయం!

29-01-2018

క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి మహేష్ బాబు సాయం!

అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరైనా చిన్నారులకు సాయం చేయాలన్నా మన కథానాయకుల్లో చాలామంది ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అగ్ర కథనాయకుడు మహేష్‌బాబు మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు మహేష్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకున్న చిన్నారితో ఫోటో దిగి కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా మహేష్‌బాబు పలువురికి ఆర్థికసాయం చేశారు. అంతేకాదు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు.