ఎన్‌ హెచ్‌ 47లో 'బూత్‌ బంగ్లా' చిత్ర గీతావిష్కరణ

ఎన్‌ హెచ్‌ 47లో 'బూత్‌ బంగ్లా' చిత్ర గీతావిష్కరణ

29-01-2018

ఎన్‌ హెచ్‌ 47లో  'బూత్‌ బంగ్లా'  చిత్ర గీతావిష్కరణ

ఏకే 9 స్టూడియోస్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో అజయ్‌ కౌండిన్య, సంధ్య, అనూష హీరో, హీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం 'ఎన్‌ హెచ్‌ 47లో 'బూత్‌ బంగ్లా'. ఈ చిత్ర ఆడియో కార్యక్రమం ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఠాగూర్‌ బాలాజీ సింగ్‌ (టిఆర్‌ఎస్‌నేత), వి.ఆంజనేయు (బీజేపీ లీడర్‌)లు అతిథులుగా విచ్చేసి సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఠాగూర్‌ బాలాజీసింగ్‌ మాట్లాడుతూ.. సినిమా చేయాలంటే ఎంత ఇష్టం ఉంటుందో అంత కష్టం కూడా ఉంటుంది. అజయ్‌ కౌండిన్య ఆ కష్టాలు అన్నీ పడ్డారు. ఈ టీజర్‌ చాలా బాగుంది. చిత్ర యూనిట్‌ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది అని నమ్ముతున్నాను అన్నారు.

వి. ఆంజనేయులు మాట్లాడుతూ.. మనిషి కసి ఉంటే ఏదైనా చేయగలడు అని అజయ్‌ని చూస్తే అనిపిస్తుంది. మా చిన్ననాటి స్నేహితుడు. అతనికి చిన్నప్పటి నుంచీ కళలంటే చాలా ఇష్టం. అదే అజయ్‌ని ఇక్కడి దాకా తీసుకువచ్చింది. ఈ సినిమాతో ఆయన పెద్ద దర్శకుడి స్థాయికి చేరాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు అజయ్‌ కౌండిన్య మాట్లాడుతూ. ఇంతకముందు 'వర్మ' అనే సినిమా చేసాను. నేను పరిశ్రమకు వచ్చి 12 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికి 3 సినిమాలను నిర్మించాను. పరిశ్రమకు చెందిన పవన్‌ కళ్యాణ్‌, రోజా వంటి వారు రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్నందున వారు సినీ ఇండస్ట్రీ సమస్యలపై దృష్టిపెట్టాలి. సంగీత దర్శకుడు చైతన్యరాజ మంచి పాటలు ఇచ్చారు అన్నారు. నిర్మాత అరుణాచలం మాట్లాడుతూ. అజయ్‌ పట్టుదలే ఈ సినిమాను ఇక్కడ దాకా తీసుకువచ్చింది. ఓ మంచి సినిమాకు కావాల్సిన అన్నీ సమకూర్చాం. తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. సంగీత దర్శకుడు చైతన్యరాజ మాట్లాడుతూ...  ఈ చిత్రంలో 4 పాటలు ఉన్నాయి, మెలోడీ, మాస్‌ను తలపిస్తాయి. కామెడీ హారర్‌ జోనర్‌ కావడంతో నాకు మంచి సంగీతం ఇవ్వడానికి స్కోప్‌ ఎక్కువగా దొరికింది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. 

అరుణాచలం, సంధ్య, అనూష, శ్రీధర్‌ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలను తెలియ చేసారు.. 

నటీనటులు: బేబీ లక్కీ, సంధ్య, అనూష, ఐశ్వర్య, రుద్ర, విజయ్‌ కుడిపూడి, అరుణాచలం, అజయ్‌ కౌండిన్య, బాలు తదితరులు నటిస్తు న్న ఈ చిత్రానికి నిర్మాతలు: ఆంజనేయులు కొమ్మగోని, రాసంబట్టి అరుణాచలం గౌడ్‌, సహ నిర్మాతలు: మారం రాజేష్‌ కుమార్‌, బుగ్గారపు రమేష్‌ బాబు, పాటలు, రచన, దర్శకత్వం: అజయ్‌ కౌండిన్య, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌: కబీర్‌ రఫీ, ఎడిటర్‌: సంధ్య, నిర్వాహకుడు: మాగ్నెట్‌ బాలు, రచన సహకారం: టిఆర్‌వీ, కీబోర్డ్‌: చైతన్యరాజ, సౌండ్‌ ఇంజనీర్‌: మహేందర్‌వర్మ, డి.ఐ: శ్రీశైలం.

Click here for Event Gallery