ఆ సినిమా నేను పూర్తిచేస్తా

ఆ సినిమా నేను పూర్తిచేస్తా

25-01-2018

ఆ సినిమా నేను పూర్తిచేస్తా

రామానుజ జీయర్‌ స్వామి సినిమాలో నటిస్తానని సినీ హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సీతానగరంలోగల విజయకీలాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయకీలాద్రికి రావడం సంతోషంగా ఉందన్నారు. హరిజనులకు ఆలయ ప్రవేశం, మంత్రోపదేశం చేసిన మహోన్నత వ్యక్తి రామానుజ జీయర్‌ స్వామి అని అన్నారు. నాన్నగారు తీయలేకపోయిన సినిమాను నేను పూర్తిచేస్తానన్నారు. రామానుజాచార్యుల గుర్తుగా స్టాంప్‌ రిలీజ్‌ చేసిన మోడీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విజయకిలాద్రిపై నిర్మించిన ఆలయాలు, రాజధానికి అద్భుతమైన శోభ తెస్తాయని అన్నారు.