అలనాటి నటి కృష్ణకుమారి ఇక లేరు

అలనాటి నటి కృష్ణకుమారి ఇక లేరు

25-01-2018

అలనాటి నటి కృష్ణకుమారి ఇక లేరు

అలనాటి ప్రముఖ నటి కృష్ణ కుమారి బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. మరో ప్రముఖనటి షావుకారు జానకికి స్వయాన సోదరి అయిన కృష్ణకుమారి 1933 మార్చి 6న బంగాల్‌లో జన్మించారు. 1951లో ఆమె సినీరంగ ప్రవేశం జరిగింది. నవ్వితే నవరత్నాలు ఆమెకు తొలి చిత్రం. పల్లెపడుచు, బంగారు పాప, ఇలవేల్పు, భార్యభర్తలు, కులగోత్రాలు, లక్షాధికారి, బందిపోటు వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషల్లో దాదాపు 110 చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ తదితర ప్రముఖ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించడంతో పాటు తన దైన అభినంతో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. కృష్ణకుమారి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలు బెంగళూరులో జరగనున్నట్లు సమాచారం.