మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం

మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం

18-01-2018

మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం

మహానుభావుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రీకరణను మార్చిలో ప్రారంభించనున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్‌ జీవితంలో బయటకు తెలియని కోణాలు అనేకం ఉన్నాయని అన్నారు. బయోపిక్‌ ద్వారా ఎన్టీఆర్‌ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. దేశం గర్వించేలా ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిర్మిస్తామని అన్నారు.