‘ఆచారి అమెరికా యాత్ర’ పాట విడుదల

‘ఆచారి అమెరికా యాత్ర’ పాట విడుదల

13-01-2018

‘ఆచారి అమెరికా యాత్ర’ పాట విడుదల

నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’.  ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ఈ చిత్రంలోని ‘స్వామి రారా..దివి నుంచి దిగిరారా’ అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో వెంకటేశ్వరస్వామి గొప్పతనాన్ని వివరిస్తూ పాటను కంపోజ్‌ చేశారు. ‘దేనికైనా రెడీ’ తరువాత మంచు విష్ణు పూజారి గెటప్‌లో నటించిన రెండో సినిమా ఇది. బ్రహ్మానందం, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పద్మజ పిక్చర్స్‌ బ్యానర్‌పై కిట్టు, కీర్తి చౌదరి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాను 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.