రజనీ కోసం లైకాను వదిలేశాడు

రజనీ కోసం లైకాను వదిలేశాడు

03-01-2018

రజనీ కోసం లైకాను వదిలేశాడు

ఇటీవల రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్‌ తన కార్యచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఆయనకు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలనుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. లారెన్స్‌ లాంటి రజనీ అభిమానులు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించగా, ఇప్పుడు మరో వ్యక్తి రజనీ తో కలిసి నడిచేందుకు సిద్దమయ్యాడు. ఇన్నాళ్లు లైకా ప్రొడక్షన్స్‌ సంస్థకు క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేసిన రాజు మహాలింగం, లైకాకు రాజీనామా చేసి రజనీ పొలిటిక్‌ పార్టీ కోసం పనిచేయనున్నట్లుగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్‌ రజనీ హీరోగా తెరకెక్కిస్తున్న 2.ఓ సినిమాకు రాజు మహాలింగం పనిచేశారు. ఈ సినిమా సమయంలో రజనీ ఆలోచనలకు ఆకర్షితుడైన మహాలింగం రజనీతో కలిసి నడిచేందుకు అంగీకరించారు.