ఇప్పట్లో పెళ్లిలేదు!

ఇప్పట్లో పెళ్లిలేదు!

03-01-2018

ఇప్పట్లో పెళ్లిలేదు!

అటు సౌత్‌ ఇటు నార్త్‌లో గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్‌ ఈ మధ్య ప్రేమలో పడింద్న వార్త మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే వుంది. ఇప్పటికే వీరిద్దరి వ్యవహారంపై జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. శృతిహాసన్‌ మైఖేల్‌ కోర్సాల్‌ అనే లండన్‌ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందంటూ వినిపిస్తున్న వార్తల సారాంశం. అతనితో పీకలోతు ప్రేమలో మునిగిపోయిందని, తన కుటుంబానికి కూడా అతన్ని పరిచయం చేసిందని అంటున్నారు. ఈ విషయంపై శృతిహాసన్‌ స్పందిస్తూ తనతో కలిసివున్నంత మాత్రాన అతనితో లవ్‌లో వున్నట్లు కాదని, అతను కేవలం మంచి స్నేహితుడే తప్ప, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదంటూ కొట్టిపారేసింది. మరో రెండేళ్ల తరవాతైనా సరే పెళ్లిచేసుకుంటానా? లేదా? అన్న విషయం తానిప్పుడే చెప్పలేనని, ఎవరిని పెళ్లిచేసుకుంటాను అన్న విషయం ఆ సమయం వస్తే ఖచ్చితంగా చెబుతానని, అయినా ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనే వుందని చెప్పుకొచ్చింది.