'వైఎస్ఆర్' బయోపిక్‌లో సూపర్‌స్టార్?

'వైఎస్ఆర్' బయోపిక్‌లో సూపర్‌స్టార్?

02-01-2018

'వైఎస్ఆర్' బయోపిక్‌లో సూపర్‌స్టార్?

తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కనున్నట్టు ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర బయోపిక్‌కు రంగం సిద్ధమైనట్ట వార్తలు వస్తున్నాయి. దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోందట. ఇటీవల ఓ చిన్న సినిమాతో మంచి విజయం అందుకున్న ఓ దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులను పూర్తి చేశాడట. పాదయాత్ర కారణంగానే వైఎస్‌ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈ చిత్రానికి యాత్ర అని పేరు పెట్టబోతున్నారట. కాగా, ఈ సినిమాలో వైఎస్‌ పాత్రలో మలయాళ అగ్ర నటుడు సూపర్‌స్టార్‌ మమ్ముట్టిని నటింపచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమాచారం మమ్ముట్టికి అందజేశారని, ఆయన అంగీకరిస్తే కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని టాక్‌.