కృష్ణం రాజుతో ప్రభాస్‌ దందా?

కృష్ణం రాజుతో ప్రభాస్‌ దందా?

01-01-2018

కృష్ణం రాజుతో ప్రభాస్‌ దందా?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ లో సాహో అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్‌లో మూవీ రిలీజ్‌ అవుతుందని తెలుస్తుండగా, ఈ మూవీ తర్వాత ప్రభాస్‌ యూవీ క్రియేషన్స్‌లోనే జిల్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాధ కృష్ణతో ఓ ప్రాజెక్టు చేయనున్నాడు. 2019లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ళనుందని అంటున్నారు. కట్‌ చేస్తే తన పెదనాన్న కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ మూవీ చేసేందుకు సిద్దమయ్యాడని టాక్‌. హోమ్‌ బేనర్‌ గోపి ప్రొడక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తుండగా, ఈ సినిమా కోసం దందా అనే టైటిల్‌ను ఇప్పటికే ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారని అంటున్నారు. కృష్ణంరాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అంతేకాదు దందా మూవీలో తాను ఓ స్పెషల్‌ రోల్‌ వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారట. మరి ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ వార్తలలో నిజమెంతో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.