రాజకీయాల్లోకి వస్తున్నా తలైవా

రాజకీయాల్లోకి వస్తున్నా తలైవా

01-01-2018

రాజకీయాల్లోకి వస్తున్నా తలైవా

రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. చెన్నైలో అభిమానులతో సమావేశమైన రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై సృష్టత ఇచ్చారు. దేశ రాజకీయాలు భష్ట్రు పట్టిపోయాయని, వాటని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. డబ్బు, పదవి ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. ప్రస్తుతం రాజ్యం ఏలుతున్న పార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలోనే రాజీనామా చేస్తాను. నేను ఏర్పాటు చేయబోయే పార్టీ నిజం, పని, అభివృద్ధి అనే మూడు మంత్రాలతో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చెడిపోయింది. తమిళనాడు రాష్ట్రం గురించి ఇతర రాష్ట్రాలు హేళన చేసి మాట్లాడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం నేను ఇప్పుడు తీసుకోకపోతే పెద్ద తప్పు చేసినవాడినవుతాను. ప్రజాస్వామ్యం పేరిట కొందరు రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు. రాజకీయాలు నాకు కొత్తం కాద. 1996లోనే  నేను రాజకీయాల్లో ఉన్నాను అన్నారు.