పద్మావతి కి లైన్‌ క్లియర్‌

పద్మావతి కి లైన్‌ క్లియర్‌

30-12-2017

పద్మావతి కి లైన్‌ క్లియర్‌

బాలీవుడ్‌ మూవీ పద్మావతికి ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 28న జరిగిన భేటీలో పద్మావతి వివాదంపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మూవీలోని ఓ పాటను మార్చాలని నిర్మాతలకు సూచించారు అధికారులు, మరోవైపు కర్ణిసేన కార్యకర్తలు సినిమాను అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటకే ఎన్నో వివాదాల నడుమ డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన మూవీ ఆగిపోయింది. ఏకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పద్మావతిని ప్రదర్శించేందుకు నిరాకరించాయి. దాంతో చిత్ర యూనిట్‌ విడుదలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. బాలీవుడ్‌ బడా దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ, దీపకా పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణవీర్‌ సింగ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలు వివాదాలు సినిమాకు కావాల్సినంతా ప్రచారాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.