తన భవిష్యత్‌ను భగవంతుడే నిర్ణయిస్తాడు

తన భవిష్యత్‌ను భగవంతుడే నిర్ణయిస్తాడు

30-12-2017

తన భవిష్యత్‌ను భగవంతుడే నిర్ణయిస్తాడు

తన భవిష్యత్‌ను భగవంతుడే నిర్ణయిస్తాడని దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సృష్టం చేశారు. వారం రోజులుగా ఆయన తన అభిమానులతో భేటీ అవుతున్నారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఆయన తన అభిమానులను ఊరిస్తూ వచ్చారు. ఈ సారి కూడా ఆయన రాజకీయ రంగం ప్రవేశంపై సృష్టత ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తన రాజకీయరంగ ప్రవేశంపై ఇప్పటికిప్పుడే తాను ఎటువంటి నిర్ణయం తీసుకోబోవడం లేదని ఆయన చెప్పారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై డిసెంబరు 31న ప్రకటన చేస్తానని రజనీ తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఒకరోజు ముందే ఇప్పటికప్పుడు తాను రాజకీయ రంగ ప్రవేశం చేయడం లేదని తేల్చి చెప్పారు. త్వరలో విడుదల కానున్న చిత్రాలు 2.0, కాలా విడుదల తరువాతనే తన భవిష్యత్‌ ఏమిటన్నది తేలుతుందని ఆయన పేర్కొన్నారు.