పెటా 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా అనుష్కశర్మ

పెటా 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా అనుష్కశర్మ

29-12-2017

పెటా 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా అనుష్కశర్మ

పీపుల్ ఫ‌ర్ ఎథిక‌ల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమ‌ల్స్ (పెటా) సంస్థ 2017 సంవ‌త్సారానికి గాను ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా బాలీవుడ్ భామ‌ అనుష్క శ‌ర్మ‌ను ఎంపిక చేసింది. జంతు సంబంధిత కార్యాక్ర‌మాల ద్వారా ఆమె చేసిన కృషికి గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు సంస్థ అసోసియేట్ డైరెక్ట‌ర్ స‌చిన్ బంగేరా ఒక ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేశారు. అంతేకాకుండా ముంబైలో బండ్ల‌ను లాగే గుర్రాల‌కు కూడా స్వేచ్ఛ‌ను ఇవ్వాల‌ని అనుష్క ప్ర‌చారం చేసింది. అలాగే త‌న వ‌స్త్రాల బ్రాండ్ నుష్ ద్వారా అనుష్క జంతుహింస చేయొద్ద‌ని ప్ర‌చారం చేసింది. అందుకోసం ప్ర‌త్యేకంగా ఓ క్లాత్‌లైన్‌ని కూడా విడుద‌ల చేసింది. గ‌తంలో అనుష్క శ‌ర్మ‌ను పెటా హాటెస్ట్ వెజిటేరియ‌న్ సెలెబ్రిటీగా కూడా గుర్తించిన సంగ‌తి తెలిసిందే.