వారి ముందు మాత్రమే మీరు తలవంచాలి

వారి ముందు మాత్రమే మీరు తలవంచాలి

28-12-2017

వారి ముందు మాత్రమే మీరు తలవంచాలి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డిసెంబరు 31 వరకూ ఆయన అభిమానుల సమావేశంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ రజనీ మాట్లాడారు. ఆయన ఎప్పుడు స్టేజ్‌ మీదకు వచ్చినా అభిమానులు గుంపులుగా వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరిస్తున్నారు. ఈ విషయం గురించి తలైవా ప్రస్తావిస్తూ నా పాదాలకు కాదు. తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు, దేవుడి పాదాలకే నమస్కరించాలి. దేవుడు మీకు జన్మనిస్తే మీ తల్లిదండ్రులు మిమ్మిలి పెంచి పోషించారు. కాబట్టి వారి ముందు మాత్రమే మీరు తలవంచాలి. రాజకీయ రంగం ప్రవేశం గురించి రజనీ డిసెంబర్‌ 31న ప్రకటిస్తానని సమావేశం మొదలైన రోజు వెల్లడించారు. అయితే అది రాజకీయాల గురించా? కాదా అన్న విషయం మాత్రం సస్పెన్ష్‌గా ఉంచారు.