అతను నాకంటే చిన్నవాడిగా అనిపిస్తాడు

అతను నాకంటే చిన్నవాడిగా అనిపిస్తాడు

28-12-2017

అతను నాకంటే చిన్నవాడిగా అనిపిస్తాడు

విశాల్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఇరుంబు థిరాయ్‌. తెలుగులో ఈ చిత్రం అభిమాన్యుడుగా రాబోతోంది. పీఎస్‌.మిత్రన్‌  ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుక చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ విశాల్‌ నాకంటే చిన్నవాడిగా అనిపిస్తాడు. అతని కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మిత్రన్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కానీ ఆయనతో పనిచేస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిగా అనిపిస్తారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అని చెప్పుకొచ్చాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుది. ఇందులో సమంత రతి దేవి అనే సైకాలిజిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు. అర్జున్‌ వైట్‌ డెవిల్‌గా విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కథ వినగానే  విశాల్‌ విలన్‌గా నటిస్తానని చెప్పారనీ కానీ హీరోగా అయితేనే బాగుంటుదని నచ్చజెప్పానని దర్శకుడు మిత్రన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.