భారత కెప్టన్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతుల రెండో రిసెప్సన్ అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై లోయర్ పర్ల్లోని రెజీస్ ఆస్టర్ బాల్రూమ్లో జరిగిన ఈ వేడుకకు క్రీడాలోకం, బాలీవుడ్ తారాగణం తరలి వచ్చింది. బ్యాటింగ్ దిగ్గజం సచిన్, సెహ్వాగ్, గవాస్కర్‌తో పాటు క్రికెటర్లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ధోనీ కుటుంబ సమేతంగా హాజరుగాకా, జడేజా, పుజార, కుల్దీప్, మనీష్ పాండే, చాహల్, అశ్విన్, ఉనాద్కట్, బుమ్రా, ఉమేశ్ కూడా కార్యక్రమానికి విచ్చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనుష్క బంగారు వర్ణంతో తయారు చేసిన లెహంగా ధరించగా, తెల్లని కుర్తాపై డాప్లర్ బ్లూ బ్లేజర్‌ను విరాట్ ధరించారు. అమితాబ్, కింగ్ ఖాన్ షారూఖ్, రణ్‌బీర్ పూర్, అభిషేక్, ఐశ్వర్య, కత్రినా, మాధురి, శ్రీదేవి, బోనీ కపూర్, మహేశ్ భూపతి, లారాదత్తాలతో ఈ వేడుక అదిరిపోయింది. నీతా అంబానీ, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు. పాత విభేదాలు పక్కనబెడుతూ భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సతీసమేతంగా ఈ ఫంక్షన్‌కు రావడం విశేషం.