అందగత్తెకు డాక్టరేట్‌?

అందగత్తెకు డాక్టరేట్‌?

27-12-2017

అందగత్తెకు డాక్టరేట్‌?

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ప్రియాంకా చోప్రా, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా సత్తా చాటిన ఈ భామతో సినిమాలు చేసేందుకు అటు బాలీవుడ్‌ నుండి హాలీవుడ్‌ వరకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.  ఈ అమ్మడి అందానికి దాసోహం అవ్వని రసిక ప్రియుడు ఉండరు. ఇప్పటికే అటు నటిగా, ఇటు గ్లామర్‌ భామగా ఇమేజ్‌ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా, ఇకపై డాక్టర్‌ ప్రియాంక చోప్రా మారింది. అవును తాజాగా ఆమెకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలి అంతర్జాతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్టు ప్రకటించింది. అన్నట్టు ప్రియాంక పుట్టింది బరేలిలోనే. తాజాగా యూనివర్సిటీ ఈ డాక్టరేట్‌ని ప్రకటించింది. ప్రియాంకా చోప్రా అటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.