ఇలియానా పెళ్లయిందా!

ఇలియానా పెళ్లయిందా!

26-12-2017

ఇలియానా పెళ్లయిందా!

గోవా సుందరి ఇలియానా సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా నిత్యం వార్తల్లో ఉంటోంది. కెరీర్‌పరంగా ఏ మాత్రం ప్రోగ్రెస్‌ లేని ఇలియానా కొంతకాలంగా ఆస్ట్రేలియన్‌ ఫోటో గ్రాఫర్‌ అండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి ఆధారంగా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చెల్‌ చేస్తున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా ఇలియానా సోషల్‌ మీడియాలో ఓ పోటో షేర్‌ చేసింది. ఏడాదిలో తనకు అత్యంత ఇష్టమైన సమయం అంటూ క్రిస్మస్‌ గురించి చెప్పింది. ఇలియానా పోస్ట్‌ చేసిన ఫోటో కింద ఫోటో బై హబ్బీ అని కామెంట్‌ పెట్టింది. ఈ వ్యాఖ్య చర్చనీయాంశమైంది. ఇలియానా పెళ్లి చేసుకుంది అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆండ్రూని హబ్బీ అని సంబోధించడం చర్చనీయాంశం అయింది. ఇలియానా రహస్యంగా పెళ్లి చేసుకుందని, ఆ విషయాన్ని బహిరంగపరిచేందుకే హబ్బీ అని చెప్పుకొచ్చిందని అంటున్నారు. ఒక్క వ్యాఖ్య కారణంగా ఇలియానా పెళ్లి విషయం గురించి చర్చ జరుగుతోంది.