క్రిస్మస్‌ సందర్భంగా ‘గాయత్రి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

క్రిస్మస్‌ సందర్భంగా ‘గాయత్రి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

24-12-2017

క్రిస్మస్‌ సందర్భంగా ‘గాయత్రి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 42వ చిత్రం ‘గాయత్రి’. దర్శకుడు ఆర్‌.మధన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో మోహన్‌బాబు కోపంగా చూస్తున్న తీరు.. ‘ఆరోజు రాముడు చేసింది తప్పు అయితే..నాదీ తప్పే’ అని రాసున్న క్యాప్షన్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని మోహన్‌బాబు సొంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మంచు విష్ణు, శ్రియ, ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ, నిఖిలా విమల్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక గాయత్రి మూవీని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.