జనవరిలో టచ్‌ చేస్తాడట!

జనవరిలో టచ్‌ చేస్తాడట!

23-12-2017

జనవరిలో టచ్‌ చేస్తాడట!

రాజా ది గ్రేట్‌తో మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకున్న రవితేజ, ప్రస్తుతం టచ్‌ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతి కానుగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పెద్ద సినిమాలు ఉండడంతో సినిమాను జనవరి 26కు వాయిదా వేశారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్‌పూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ రెండు భిన్నమైన పాత్రల్లో కన్పిస్తాడట. ఇప్పటికే ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రం లోని పాటలని త్వరలోనే విడుదల చేస్తారట.