జనవరి 22న భావన పెళ్ళి!

జనవరి 22న భావన పెళ్ళి!

22-12-2017

జనవరి 22న భావన పెళ్ళి!

మలయాళంలో సక్సెస్‌ పూల్గా రాణిస్తున్న హీరోయిన్‌ భావన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. తెలుగులో మహాత్మ, ఒంటరి, నిప్పు వంటి తెలుగు చిత్రాలలో నటించింది. ఈ మధ్య భావనని దిలీప్‌ కిడ్నాప్‌ చేసాడనే విషయంలో ఈ అమ్మడు బాగా వార్తలలో నానుతూ వచ్చింది. మార్చిలో కన్నడ ఫిలీం ప్రొడూస్యర్‌ నవీన్తో మలయాళం నటి భావన నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య కోచిలో ఈ వేడుక ప్రైవేట్గా జరిగింది. భావన ఆప్త మిత్రురాలు, మళయాళం నటి మంజూ వారియర్‌ సైతం నిశ్చితార్థానికి హాజరయ్యారు. పెళ్ళి డిసెంబర్‌లో అంటూ ఈ మధ్య పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. కాని తాజాగా వీరు పెళ్లి కార్డుతో అన్ని రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. జనవరి 22న బెంగళూర్‌ లోని త్రిసూర్‌ లో ఉన్న లలు కన్వెన్షన్‌ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది. ఉదయం 10:30 నుండి 11:30ని.ల మద్య వీరు పెళ్ళి పీటలెక్కబోతున్నారు. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్యన ఈ వివాహం జరగనుందని తెలుస్తుంది. పీసీ శేఖర్‌ 2012లో నిర్మించిన రోమాంటిక్‌ కామెడీ చిత్రం రోమియోతో భావన, నవీన్‌ ప్రేమపక్షులుగా మారారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా వీరు ప్రేమబంధంలో కొనసాగుతున్నారు.