పవన్ కళ్యాణ్ పాడిన 'కొడకా.. కోటేశ్వరరావు' పాట

పవన్ కళ్యాణ్ పాడిన 'కొడకా.. కోటేశ్వరరావు' పాట

22-12-2017

పవన్ కళ్యాణ్  పాడిన 'కొడకా.. కోటేశ్వరరావు' పాట

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్ర ఆడియోని రీసెంట్ గా విడుదల చేశారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఐదు పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. న్యూఇయర్‌ కానుకగా పవన్‌ అభిమానులకు ఇస్తానన్న సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది. పవన్ పాడిన కొడకా.. కోటేశ్వరరావు అనే పాటని డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. గురువారమే ఈ పాట రికార్డింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు.


Click here for Event Gallery