తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన బన్నీ

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన బన్నీ

20-12-2017

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన బన్నీ

ప్రపంచ తెలుగు మహాసభలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొనియాడారు. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అత్యద్భుతం అని బన్నీ ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. అంతేకాదు తెలుగు మహాసభలు విజయవంతం కావడంతో తనకి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అన్నాడు. ప్రసుత్తం అల్లు అర్జున్‌ నా పేరు సూర్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున సరసన అను ఇమాన్యుయెల్‌ నటిస్తోంది.