‘భాగమతి’ టీజర్‌ విడుదల

‘భాగమతి’ టీజర్‌ విడుదల

20-12-2017

‘భాగమతి’ టీజర్‌ విడుదల

అనుష్క టైటిల్‌పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భాగమతి’. పిల్ల జమీందర్ ఫేం జి.అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ ఈరోజు విడుదలైంది. అరుంద‌తి స్టైల్‌లోనే ఈ సినిమా ఉంటుందని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. జ‌న‌వరి 26న విడుద‌ల కానున్న ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ డ్రామా చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. విద్యు రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఎస్.ఎస్‌ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.