"తొలి ప్రేమ" టీజ‌ర్ విడుద‌ల‌

"తొలి ప్రేమ" టీజ‌ర్ విడుద‌ల‌

20-12-2017

వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. ఇందులో వరుణ్‌కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఫిబ్ర‌వ‌రి 9న సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ లో వేగం పెంచారు. మ‌న జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వ‌చ్చిన ఫ‌స్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎన్న‌టికి మ‌ర‌చిపోలేం అనే డైలాగ్ మాత్ర‌మే టీజ‌ర్‌లో ఉంది. ఇక వ‌రుణ్ తేజ్ ఈ చిత్రంలో డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపిస్తాడ‌ని టీజ‌ర్‌తో క‌న్‌ఫాం అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ ఏ ఒక్క దాంట్లో కూడా హీరోయిన్ రాశీ ఖన్నాని చూపించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.