‘అజ్ఞాతవాసి’ టీజర్‌ విడుదల

‘అజ్ఞాతవాసి’ టీజర్‌ విడుదల

16-12-2017

‘అజ్ఞాతవాసి’ టీజర్‌ విడుదల

అజ్ఞాతవాసి టీజర్‌ విడుదల కోసం పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్‌లో ఇదే హాట్‌ టాపిక్‌. అజ్ఞాతవాసి టీజర్‌ డేః అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇండియా ట్రెండ్స్‌లో నాలుగోస్థానంలో ఉంది. ఓ దశలో ఇది మూడోస్థానంలో ఉండటం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌ నుంచి అభిమానులు కోరుకునే మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు, త్రివిక్రమ్‌ శైలి కామెడీకి సినిమాలో ఏ మాత్రం కొదవ ఉండదని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో పవన్‌ సరసన కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈనెల 19న ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10 ‘అజ్ఞాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.