మంత్రి తలసానితో మా ప్రతినిధుల భేటీ

మంత్రి తలసానితో మా ప్రతినిధుల భేటీ

16-12-2017

మంత్రి తలసానితో మా ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ నెల 17న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సినీ సంగీత విభావరి ఏర్పాట్లపై ఆయనతో చర్చించారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా నేతృత్వంలో సచివాలయానికి వెళ్లిన ప్రతినిధులు మంత్రితో కాసేపు మాట్లాడారు. సినీ సంగీత విభావరికి సంబంధించిన నిర్వహణ ప్రణాళిక పూర్తయిందని తెలిపారు.