శివకాశీపురం సాంగ్ లాంచ్ చేసిన తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్
MarinaSkies
Kizen

శివకాశీపురం సాంగ్ లాంచ్ చేసిన తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

15-12-2017

శివకాశీపురం సాంగ్ లాంచ్ చేసిన తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో హరీష్ వట్టి కూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తున్న చిత్రం       '' శివకాశీపురం ''. స్వర్గీయ స్వర చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నారు . ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న శివకాశీపురం చిత్ర నిర్మాణం పూర్తిచేసుకొని సెన్సార్ కు సిద్ధంగా ఉంది. 

ఈ నేపథ్యంలో ఈరోజు మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్ డిసి కార్యాలయంలో మూడవ పాటని తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్ రామ్మోహన్ రావు రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా ఎఫ్ డిసి చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ '' శివకాశీపురం '' చిత్రాన్ని అత్యధిక శాతం మంచిర్యాల లో చిత్రీకరించామని, అక్కడి ప్రజలు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారని దర్శక నిర్మాతలు చెప్పారు సంతోషం , అక్కడే కాదు తెలంగాణ అంతటా సినిమా వాళ్లకు సహకరించే వాళ్లే ఎక్కువగా ఉంటారు . చక్రవర్తి గారి మనవడు, శ్రీ తనయుడు రాజేష్ ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు ..... సినిమా నిర్మాణం ఎంత బాధ్యతగా చేయాలో అంతకంటే ఎక్కువగా రిలీజ్ ని ప్లాన్ చేసుకోవాలి, సరైన డేట్ లో రిలీజ్ చేయడమే మనముందున్న టాస్క్ అని ...... శివకాశీపురం చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు . 

నిర్మాత పులిమామిడి మోహన్ బాబు మాట్లాడుతూ " రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా మా చిత్రం లోని పాట రిలీజ్ కావడం ఆనందంగా ఉంది , ఈ సినిమాని మంచిర్యాలలో చిత్రీకరించాం ఆ సమయంలో రామ్మోహన్ రావు గారి  కుటుంబం మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారని , అలాగే రిలీజ్ కి కూడా రామ్మోహన్ రావు గారి సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. 

దర్శకులు వట్టికూటి హరీష్ మాట్లాడుతూ " సినిమా సెన్సార్ కి సిద్ధంగా ఉంది, త్వరలోనే సెన్సార్ కు పంపించి జనవరి లేదా ఫిబ్రవరి లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని .... పవన్ శేష అందించిన సంగీతం మా  చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని ,మాకు అన్నిరకాల గైడెన్స్ ఇస్తున్న రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు పవన్ శేష, పాటల రచయిత చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 

Click here for Photogallery