బాహుబలి-2దే అగ్రస్థానం!
MarinaSkies
Kizen

బాహుబలి-2దే అగ్రస్థానం!

14-12-2017

బాహుబలి-2దే అగ్రస్థానం!

ఈ ఏడాది (2017) గూగుల్‌లో అత్యధికులు అమితాసక్తితో అన్వేషించిన అంశాల్లో బాహుబలి-2 చలనచిత్రం అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసిన ఈ దృశ్యకావ్యానికి సంబంధించిన వివరాల కోసం ఆసక్తిగా వెతుకుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించిన ఫలితాలు సృష్టం చేశాయి. జనం అమితాసక్తితో అన్వేషణ సాగించిన ఇతర అంశాల్లో క్రికెట్‌పై భారత్‌కున్న గాఢానురక్తికి అద్దంపడుతూ సాగిన లైవ్‌ క్రికెట్‌ స్కోర్‌ అన్వేషణ కూడా ప్రత్యేకంగా నిలిచింది.