హార్వర్డ్ వర్శిటీకి రూ.20 లక్షల సాయం : కమల్

హార్వర్డ్ వర్శిటీకి రూ.20 లక్షల సాయం : కమల్

17-11-2017

హార్వర్డ్ వర్శిటీకి రూ.20 లక్షల సాయం : కమల్

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకు సంబంధించి ప్రత్యేక పీఠం ఏర్పాటుపై తమిళులు హర్షం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పలు పార్టీలు, వ్యక్తులు భాషా పరిశోధనకు సంబంధించి ప్రత్యేక నిధిని అందజేస్తున్నారు. ఇందులో భాగంగా విశ్వనటుడు కమల్‌హాసన్‌ రూ.20 లక్షలు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ప్రొఫెసర్‌ జ్ఞాన సంబంధానికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానసంబంధం మాట్లాడుతూ తమిళం అభివృద్ధికి కమల్‌ ఎప్పటి నుంచో గళమెత్తుతున్నారని తెలిపారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో తమిళానికి ప్రత్యేక చోటు కేటాయించాలని ఏడాది క్రితం నుంచే ఆయన డిమాండ్‌ చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.20 లక్షల సాయం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లండన్‌కు చెందిన డాక్టర్‌ ఆర్ముగం మురుగయ్య, అమెరికాకు చెందిన కాల్డ్‌వెల్‌, రచయిత సుధా తదితరులు పాల్గొన్నారు.