వర్మ చిత్రానికి లేని అభ్యంతరం లక్ష్మీస్ వీరగ్రంధం కు ఎందుకు?

వర్మ చిత్రానికి లేని అభ్యంతరం లక్ష్మీస్ వీరగ్రంధం కు ఎందుకు?

16-11-2017

వర్మ చిత్రానికి లేని అభ్యంతరం లక్ష్మీస్ వీరగ్రంధం కు ఎందుకు?

రాంగోపాల్‌ వర్మ చిత్రానికి లేని అభ్యంతరం లక్ష్మీస్‌ వీరగ్రంధం సినిమాకు ఎందుకు? అని లక్ష్మీస్‌ వీరగ్రంధం సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని దుష్ట శక్తులు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. చిత్ర నిర్మాణానికి అవరోధలు తొలగించాలని సూర్యభగవానుడిని కోరుకున్నానని పేర్కొన్నారు. అలాగే సినిమా షూటింగ్‌కు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతానని అన్నారు.