కరిష్మా రెండో పెళ్లి?

కరిష్మా రెండో పెళ్లి?

16-11-2017

కరిష్మా రెండో పెళ్లి?

అలనాటి అందాల తార కరిష్మా కపూర్‌ (43) రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ కుమార్‌తో విడాకుల తరువాత కొంతకాలంగా అన్నింటికి దూరంగా ఉంటున్న కరిష్మా ఈ మధ్య ప్రముఖ వ్యాపారవేత్త సంతీప్‌ తోష్నివాల్‌తో సన్నిహితంగా ఉన్నట్లు బీ టౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా కరిష్మాచ సందీప్‌లు బాంద్రాలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. అందులో ఎగేజ్‌మెంట్‌ రింగ్‌కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరిష్మా ప్రేమ, రెండో పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి రణధీర్‌ కపూర్‌ స్పందించారు. కరిష్మ రెండో పెళ్లి చేసుకుంటే తన ఆశీస్సులు ఉంటాయని సృష్టం చేశారు. కరిష్మా ఇంకా చిన్నపిల్లే. పెళ్లి చేసుకుని ఆనందంగా గడిపే సమయం ఉంది. గతాన్ని మర్చిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ఆమె మొదలు పెట్టాలనుకుంటే నా కన్నా ఆనందించేవారు ఎవరుంటారు అని రణధీర్‌ కపూర్‌ అన్నారు.