లక్ష్మీ పార్వతి పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా?

లక్ష్మీ పార్వతి పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా?

16-11-2017

లక్ష్మీ పార్వతి పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా?

తమిళ నాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి తాను ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్‌ వీరగ్రంధం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నవంబర్‌ 12న లాంచ్‌ కాగా, ఇటీవలే షూటింగ్‌ నిమిత్తం ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు కి వెళ్లింది చిత్ర బృందం. అక్కడి ప్రజల నుండి నిరసన వ్యక్త కావడంతో మూవీ టీం వెనుదిరిగి వచ్చారు. అయితే ఈ లక్ష్మీస్‌ వీరగ్రంధం చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రని రాయ్‌ లక్ష్మీ చేయనుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం పూజా కుమార్‌ లక్ష్మీస్‌ వీరగ్రంధంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని దర్శకుడు తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా తెలిపాడు. వీరగంధం సుబ్బారావు సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా ప్రవేశించిందన్న నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నాడు కేతిరెడ్డి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను మహేష్‌ మంజ్రేకర్‌ పోషించనున్న సంగతి తెలిసిందే. పూజా కుమార్‌ రీసెంట్‌ గా గరుడ వేగ చిత్రంలో నటించగా, ఈ అమ్మడి నటనకి మంచి మార్కులు పడ్డాయి.